ప్రేక్షకులను ‘వశం’ చేసుకుంటుంది: తమ్మారెడ్డి భరద్వాజ

కంటెంట్ బాగుంటే చిన్న చిత్రాలు కూడా పెద్ద విజయాన్ని సాధిస్తాయి అని ఎన్నో చిత్రాలు నిరూపించాయి. ఈ ‘వశం’ ట్రైలర్ చూస్తుంటే ప్రేక్షకులను తప్పకుండా ‘వశం’ చేసుకునేలా ఉంది అన్నారు. సీనియర్ దర్శక, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ. శుకా ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై శ్రీకాంత్ చల్లా దర్శకత్వం వహించిన చిత్రం ‘వశం’. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రం సెన్సార్ పనులు జరుగుతున్నాయి. బుధవారం ఫిల్మ్‌ఛాంబర్‌లో ఈ మూవీలోని సాంగ్‌ను ప్రముఖ దర్శక, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ విడుదల చేయగా, మరో ప్రముఖ నిర్మాత రాజ్‌కందుకూరి ్టట్రైలర్‌ను ఆవిష్కరించారు. 
ఈ సందర్భంగా తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ.. కంటెంట్ బాగుంటే చిన్న చిత్రాలు కూడా పెద్ద విజయాన్ని సాధిస్తాయి అని ఎన్నో చిత్రాలు నిరూపించాయి. ఈ సినిమా ట్రైలర్ చూస్తుంటే ఈ మధ్య కాలంలో వస్తున్న చిన్న చిత్రాల్లో భిన్నంగా మాత్రం ఉంది. ప్రోమో చూస్తుంటే దర్శకుడు చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నట్లు కనిపిస్తోంది. కొత్త జనరేషన్ ప్రస్తుతం పరిశ్రమకు చాలా అవసరం. ప్రస్తుతం చాలా మంది మంచి టెక్నీషియెన్స్ వస్తున్నారు. ఆ కోవలోనే శ్రీకాంత్ కూడా మంచి పేరు తెచ్చుకోవాలి. పేరు తెచ్చుకునే స్థాయిలో అతని ప్రతిభ ప్రోమోలో కనిపిస్తోంది. ఆల్ ది బెస్ట్ టు టీం అన్నారు. 
రాజ్ కందుకూరి మాట్లాడుతూ.. ‘వశం’ అంటేనే అవతలివాళ్లను వశం చేసుకోవడం. ఈ సినిమాలో ఆ శక్తి ఉందని భావిస్తున్నాను. ట్రైలర్ చూస్తుంటే డిఫరెంట్ జానర్ అని తెలుస్తోంది. శ్రీకాంత్ నాకు నాలుగు సంవత్సరాలుగా తెలుసు మంచి విషయం ఉన్నవాడు. ఆర్టిస్ట్‌లు టెక్నీషియన్స్ అందరూ చక్కగా కుదిరారు అన్నారు. 
రాజ్ ముదిరాజు మాట్లాడుతూ.. శ్రీకాంత్ నాకు సోషల్ మీడియా ద్వారా పరిచయం. ప్రస్తుతం సోషల్‌మీడియా టాలెంట్ గ్రేట్ ఎంట్రన్స్ అని చెప్పవచ్చు. ఐఐటీ చదివిన శ్రీకాంత్ సినిమాల మీద ప్యాషన్‌తో ఈ ప్రయత్నం చేయడం అభినందనీయం. నేను ఓ కీలక పాత్ర చేశాను. క్రౌడ్ ఫండింగ్‌తో శ్రీకాంత్ చేస్తున్న ఈ చిత్రం తప్పకుండా విజయవంతం కావాలని ఆశిస్తున్నా అన్నారు. 
వాసుదేవరావు మాట్లాడుతూ.. ఈ సినిమాలో నాదే మెయిన్ లీడ్. మేనేజర్ ఫోన్ చేసి ఈ సినిమా గురించి చెప్పారు. ఫస్ట్ సగం స్క్రిప్ట్ ఆన్‌లైన్‌లో ఉంది చదవండి అన్నారు. నేను ఆశ్చర్యపోయాను. సినిమా మొదలవకుండానే ఆన్‌లైన్‌లో పెట్టడం ఏమిటా అని. అయితే స్క్రిప్ట్ చదివాక వాట్‌నెక్ట్స్ అనే క్యూరియాసిటీ కలిగింది. వెంటనే ఓకే చెప్పేశాను. శ్రీకాంత్ ఈ సినిమా కోసం చాలా రీసెర్చ్ చేశాడు. చాలామంది ప్యాషనేట్ పీపుల్ ఈ సినిమాలో ఇన్‌వాల్వ్ అయ్యారు. మా బాధ్యత పూర్తయింది. ఇక  ఈ చిత్రానికి విజయాన్ని చేకూర్చాల్సింది ప్రేక్షకులే. అందుకే మా సినిమాను హిట్ చేయాల్సిందిగా వారిని కోరుకుంటున్నాం అన్నారు. 
నందకిషోర్ మాట్లాడుతూ.. నేను కూడా ఆన్‌లైన్‌లో ఈ స్క్రిప్ట్‌కు ‘వశం’ అయిపోయాను. ఈ సినిమా టైటిల్‌కు తగ్గట్టుగానే అందరినీ ‘వశం’ చేసుకుంటుంది. నేను ఇంపార్టెంట్ రోల్ చేశాను. తమ్మారెడ్డిగారు ఇంతకు ముందు చెప్పినట్లు విషయం ఉంటే తప్పకుండా సక్సెస్ అవుతుంది. మా ప్రయత్నాన్ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను అన్నారు. 
పాటల రచయిత చక్రవర్తుల మాట్లాడుతూ.. రాజ్ ముదిరాజు గారు నాకు సోషల్ మీడియా ద్వారా పరిచయం. గతంలో ఆయన దర్శకత్వం వహించిన ‘ఆంధ్రాపోరి’ చిత్రంలో పాటలు రాశాను. ఇప్పుడు ఆయన ఆర్టిస్ట్‌గా, నేను లిరికిస్ట్‌గా కలిసి పనిచేస్తున్నాం. దర్శకుడు శ్రీకాంత్ గారు మంచి క్లారిటీతో సినిమా తెరకెక్కించారు. నేను లిరికిస్ట్‌గా చేస్తున్న 5వ సినిమా. సంగీత దర్శకులు డా॥ జ్యోస్యభట్ల గారితో చేస్తున్న 3వ సినిమా. ఈ సినిమాకు నేను కూడా పనిచేసినందుకు ఆనందంగా ఉంది అన్నారు. 
కెమెరామెన్ దుర్గా కిషోర్ మాట్లాడుతూ.. ఈ సినిమాకు డీఓపీ చేయడం సంతోషంగా ఉంది. సహకరించిన నటీనటులు, టెక్నీషియెన్స్‌కు థ్యాంక్స్. ముందు దర్శకుడు నేను ఏది అనుకున్నామో ఫైనల్ అవుట్‌పుట్ అదే వచ్చింది అన్నారు. 
దర్శకుడు శ్రీకాంత్ చల్లా మాట్లాడుతూ.. వందేళ్లక్రితం కొన్ని వేల కిలోమీటర్లు గంల్లో ప్రయాణం చేయవచ్చు.. ఎలక్ట్రిసిటీతో వెలుతురు తీసుకురావచ్చు అంటే దాన్ని తప్పకుండా మ్యాజిక్ అనే వారు. అంటే మనకు తెలిసిన దాన్ని సైన్స్ అంటాం. తెలియనిదాన్ని మ్యాజిక్ అంటాం. అసలు సైన్స్ అనేది స్పిరిట్చువాలిటీలో ఒక భాగం మాత్రమే. ఒక మనిషి ఎందరో యోగులను కలిసి అధునాతన సైన్స్‌ను నేర్చుకుని.. పంచభూతాలను నియంత్రించే శక్తి సంపాదిస్తే? ఇతరులను వశం చేసుకోగలిగే శక్తి సంపాదిస్తే? అంత శక్తిని ఒక మనిషి నియంత్రించగలడా అనే విషయాలను ఇందులో ప్రస్తావించాం. ఈ సినిమాలో సైన్స్‌ను, సూపర్ నాచురల్ పవర్‌ను కలిపి తీసుకున్నాం. పంచభూతాలను తన ఆధీనంలోకి తీసుకునే పవర్ వచ్చిన మనిషి ఆతర్వాత తనలోని మానవత్వాన్ని కోల్పోతాడా? లేక సమాజానికి మంచి చేయడానికి దాన్ని ఉపయోగిస్తాడా? అనే థీవ్‌ు తీసుకున్నాం. ఒక్క ఫ్రేవ్‌ు కూడా అనవసరం అయినది మీకు కనపడదు. ప్రవీణ్ సత్తారు గారి దగ్గర ‘చందమామ కథలు’ సినిమాకు కో రైటర్‌గా పనిచేశాను. ఆ తర్వాత ఈ కథను ఆయనకు చెప్పాను. ఆయన నువ్వు తీయగల సత్తా ఉన్న వాడివి. థింక్ వెరీ డిఫరెంట్ అన్నారు.  ఇక సినిమా నిర్మాణం ఎలా అనే ఆలోచన వచ్చినప్పుడు ఈ స్క్రిప్ట్ ఆన్‌లైన్‌లో పెట్టేద్దాం నచ్చినవారు వస్తారు మనతో అనుకున్నాం. ఆన్‌లైన్‌లో పెట్టిన తర్వాత కొందరు మిత్రులు క్రౌడ్ ఫండింగ్ చేశారు. ఆర్టిస్ట్‌లు, టెక్నీషియెన్స్ సహకారం మరువలేనిది. ముఖ్యంగా డీఓపీ దుర్గా కిషోర్ గారు అద్భుతంగా చేశారు. ఆయన గతంలో కొన్ని టాలీవుడ్, బాలీవుడ్ సినిమాలకు అసిస్టెంట్ కెమెరామెన్‌గా చేశారు. మమ్మల్ని ఆశీర్వదించడానికి ఈరోజు ఇక్కడికి వచ్చిన పెద్దలకు కృతజ్ఞతలు అన్నారు. 
కృష్ణేశ్వరరావు, వాసుదేవరావు, శ్వేతావర్మ, నందకిషోర్, అక్షయ్, ప్రదీప్, విమల్, గాయత్రీ భార్గవి, రాజ్ ముదిరాజు తదితరులు నటించిననీ చిత్రానికి కెమెరా: దుర్గా కిషోర్వ్రికిరణ్, ఎడిటింగ్: సత్య, సంగీతం: డా॥ జోస్యభట్ల, పాటలు: చక్రవర్తుల, కథ, స్క్రీన్‌ప్లే: రోహిత్ మిశ్రా, శ్రీకాంత్ చల్లా. దర్శకత్వం శ్రీకాంత్ చల్లా. 

About CineChitram

Check Also

సూపర్ స్టార్ కృష్ణ నరేష్ నవీన్ లను కలిసిన అభిమానులు

కువైట్ లో 8 సంవత్సరాలు గా  డిజైన్ వృత్తిలో  ప్రాముఖ్యత ను అందిపుచ్చుకున్న గుంటూరు ప్రాంత వాసి హుస్సేన్ మొహమ్మద్ …

Leave a Reply

Discover more from Cine Chitram

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading