చిత్రపురి కాలనీ రోడ్డు సమస్య తీరింది

‘డా|| ప్రభాకర్‌ రెడ్డి చిత్రపురి కాలనీ’లో దాదాపు 15 నుంచి 20 వేల మంది ‘ఎల్‌ఐజి, ఈడబ్ల్యుసి’ ఫ్లాట్స్‌లలో నివాసముంటున్న సంగతి తెలిసిందే. అన్ని వసతులతో పాటు పూర్తి సెక్యూరిటీ మరియు సిసి కెమెరాల భద్రతలో సినీ కార్మికుల కుటుంబాలు హాయిగా నివసిస్తున్నాయి. ఎలాంటి గొడవలు, అల్లర్లు లేకుండా అన్ని వసతులతో ఇన్ని వేల మంది ప్రశాంతంగా వుంటున్నారంటే ఆ ఘనత చిత్రపురి కాలనీ అధ్యక్షుడు కొమర వెంకటేష్‌కే చెందుతుంది. 
అయితే ఈ కాలనీలో నివశించే వారికి రోడ్డు సమస్య మాత్రం ఇప్పటివరకు వెంటాడుతూనే వచ్చింది. నిన్నటి(8 సెప్టెంబర్‌ 2016)తో ఆ రోడ్డు సమస్య పూర్తిగా తొలగిపోయింది. జిహెచ్‌ఎంసి అధికారులు దగ్గరుండి అక్కడ అడ్డుగా వున్న గోడను పూర్తిగా తొలగించారు. ఈ క్రమంతో అక్కడ గోడను పడగొట్టవద్దంటూ కొంతమంది వచ్చారు. ఈ క్రమంలో కొమర వెంకటేష్‌ తమ కమిటీ సభ్యులతో కలిసి పట్టువదలని విక్రమార్కుడిలా నిలబడి రోడ్డుకు పర్మిషన్‌ ఇచ్చిన అధికారులను పిలిపించి గవర్నమెంట్‌ అదేశాల మేరకు ఆ గోడను అధికారికంగా తొలగించేలా చేసారు. దాంతో చిత్రపురి కాలనీలో నివాసముంటున్న ప్రజలు తమ ఆనందాన్ని వ్యక్తం చేసారు. కాలనీ మొత్తం పండుగ వాతావరణంలా మారింది.
ఈ సందర్భంగా చిత్రపురి కాలనీ ప్రెసిడెంట్‌ కొమర వెంకటేష్‌ మాట్లాడుతూ… ”టింబర్‌లేక్‌ కాలనీ రోడ్డు నుంచి చిత్రపురి కాలనీ అతి తక్కువ దూరం, సులువుగా వుండటం వలన మొదట్లో కాలనీ వాసులు ఈ రోడ్డు నుంచి వస్తూపోతూ వుండేవారు. అయితే ఈ రోడ్డు మద్యలో వున్న కొంతమంది పెద్దలు వారికున్న పలుకుబడిని ఉపయోగించి చిత్రపురి కాలనీలోనికి వెళ్లేందుకు వీలులేకుండా రోడ్డు మధ్యలో అనధికారికంగా అడ్డుగోడ నిర్మించారు. గవర్నమెంట్‌ అనుమతి లేకుండా నిర్మించిన ఆ అడ్డుగోడ పెద్ద అడ్డంకిగా మారడంతో చిత్రపురి కాలనీ ప్రజలు కనీసం కాలినడకన వచ్చేందుకు వీలులేకుండా పోయింది. 
ఆ పక్కనే వున్న కొండరాళ్లు, చెట్లలోంచి ఎత్తుపల్లాల గుంతల్లో కాలినడక మాత్రమే ఎన్నో అవస్థలు పడుతూనే మా కాలనీ ప్రజలు నడిస్తున్నారు. వారు పడుతున్న అవస్థలు చూడలేక కేటిఆర్‌, తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్‌, రోడ్లు, రవాణా శాఖ మంత్రి మహేందర్‌ రెడ్డి, ఎమ్మెల్యే ప్రకాష్‌ గౌడ్‌ గార్లను చిత్రపురి కాలనీకి ఓ కార్యక్రమానికి ఆహ్వానించి… దాదాపు 15 నుంచి 20 వేల మంది పడుతున్న రోడ్డు సమస్యను ప్రత్యక్షంగా చూపించాము. దాంతో వారు సానుకూలంగా స్పందించి రోడ్డు వేయిస్తామని ప్రామిస్‌ చేసారు. టింబర్‌లేక్‌ కాలనీలో వుండే 100 మంది కన్నా చిత్రపురి కాలనీలో నివసించే దాదాపు 20 వేల మంది ప్రజల పడుతున్న అవస్థలను తక్షణమే తీర్చాలని భావించి వారు కూడా ఈ రోడ్డును అనుమతించడం జరిగింది.
టింబర్‌లేక్‌ కాలనీ వారు ఇంతటితో ఆగకుండా కోర్టులో స్టే వేయడంతో కోర్టు వారు ఇరువర్గాల వాదనను, సాక్ష్యాలను క్షుణ్ణంగా పరిశీలించి… పైగా హైటెన్షన్‌ కరెంట్‌ లైన్‌ క్రింద వున్న ఆ రోడ్డు జిహెచ్‌ఎంసి పరిధిలో వుండటంతో ఇది గవర్నమెంట్‌ రోడ్డు కనుక టింబర్‌లేక్‌ కాలనీ నుంచి చిత్రపురి కాలనీ లోనికి రోడ్డు వేయడం సరైనదేనని ఇటీవల తీర్పు ఇచ్చారు. దాంతో జిహెచ్‌ఎంసి అధికారులు, పోలీసులు దగ్గరుండి ఈ గోడను పూర్తిగా తొలగించడం జరిగింది. మా కాలనీ ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా వుండేందుకు దీనిపై సిమెంట్‌రోడ్డు వేస్తాము. అలాగే హెచ్‌ఐజి మీదుగా వెళ్లే మెయిన్‌ రోడ్డును కూడా త్వరిగతిన పూర్తి చేస్తాము. ఈ నెలాఖరుకి సిమెంట్‌ రోడ్డు నిర్మాణం పూర్తి చేయాడానికి సన్నాహాలు చేస్తున్నాము.
చిత్రపురి కాలనీ రోడ్డు మంజూరు చేయించిన కేటిఆర్‌ గారు, తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్‌, రోడ్లు, రవాణా శాఖ మంత్రి మహేందర్‌ రెడ్డి, ఎమ్మెల్యే ప్రకాష్‌ గౌడ్‌ గార్లకు మా కాలనీ ప్రజల తరుపున ప్రత్యేక ధన్యవాదములు తెలియజేస్తున్నాను” అని తెలిపారు.

About CineChitram

Check Also

టీచ్ ఫర్ చే౦జ్ ఎన్ జీ వో కు సహకారమ౦ది౦చిన రకుల్ ప్రీత్

Leave a Reply

Discover more from Cine Chitram

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading