గోదావరి గట్టోళ్ళు..గట్సున్న గొప్పోళ్లు పుస్తకావిష్కరణ

ఉభయ గోదావరి జిల్లాల నుండి వచ్చిన సినీ ప్రముఖుల విశేషాలతో రూపొందిన గోదావరి గట్టోళ్ళు..గట్సున్న గొప్పోళ్లు  అనే పుస్తకాన్ని దర్శకరత్న డా.. దాసరి నారాయణరావు ఈ రోజు ఆయన  స్వగ్రుహంలో ఆవిష్కరించారు. రాజమండ్రీ లో పోలీస్ డిపార్ట్ మెంట్ లో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ గా పనిచేస్తున్న బి.ఎస్. జగదీష్ రచించింన ఈ పుస్తకాన్ని దర్శకరత్న డా.దాసరి నారాయణ రావు ఆవిష్కరించి..తొలిప్రతిని ప్రముఖ దర్శకుడు రేలంగి నరసింహరావుకు అందజేసారు. ఈ కార్యక్రమంలో మరో దర్శకనటుడు కాశీ విశ్వనాధ్, దర్శకుడు రాజవన్నెం రెడ్డి, నటుడు సారిక రామచంద్రరావు, రచయిత బిఎస్ జగదీష్ పాల్గోన్నారు.. ఈ సందర్భంగా దర్శక రత్న దాసరి నారాయణ రావు మాట్లాడుతు.. జగదీష్ రావు గుంటూరు జిల్లాకు చెందిన వారైనప్పటికీ ఉభయ గోదావరి జిల్లాల సినీ ప్రముఖుల పై ఇలాంటి పరిశోధనాత్మ రచనలు చెయ్యడం అభినందనీయం.ఉభయ గోదావరి జిల్లాల నుండి ఇంత మంది దిగ్గజాలాంటి సినీ ప్రముఖులు చిత్ర పరిశ్రమలో ఉన్నారన్న నిజం ఈ పుస్తకం చూసాకే తెలిసింది. ఇలాంటి విశేష క్రుషి చేసిన జగదీష్ గారికి ఉభయ గోదావరి జిల్లాల సినీ ప్రముఖుల తరుపున నా క్రుతజ్నతలు..వ్యక్తిగతంగా నా  అభినందనలు తెలియజేసుకుంటున్నాను అన్నారు.

 

పుస్తక రచయిత జగదీష్ మాట్లాడుతు “నా ఈ చిరు ప్రయత్నాన్ని అభినందిస్తు పుస్తకాన్ని ఆవిష్కరించిన దర్శకరత్న దాసరి నారాయణ రావు గారికి, తొలి ప్రతిని స్వీకరించిన రేలంగి నరసింహారావు గారికి ఇతర సినీ ప్రముఖులకు నా క్రుతజ్నతలు” అన్నారు.

About CineChitram

Check Also

“ఆచారి అమెరికా యాత్ర” మొదలైంది!

Leave a Reply

Discover more from Cine Chitram

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading