15 భాషల్లో ‘సెక్స్ చాట్’ ని లాంచ్ చేసిన డ్యూరెక్స్ & Y- ఫిల్మ్స్ 

భారత దేశంలో నే మొట్ట మొదటి సెక్స్ ఎడ్యుకేషన్ కాల్పనిక సిరీస్ సెక్స్ చాట్ విత్ పప్పు & పాపా 

భారత దేశం లోనే మొట్టమొదటి సారిగా, ఒక సెక్స్ ఎడ్యుకేషన్ ఫిక్షన్ వెబ్ సిరీస్, “సెక్స్ చాట్ విత్ పప్పు & పాపా” కోసంDurex మరియు Y- ఫిల్మ్స్ చేతులు కలిపాయి. ఈ 5- పార్టుల కాల్పనిక వెబ్ సిరీస్ లో అందరూ ఓపెన్ గా మాట్లాడ డానికి ఇష్టపడని, సెక్స్ / లైంగికతకు సంబంధించిన వివిధ థీమ్స్ గురించి చర్చిస్తారు.. హస్త ప్రయోగం, కాలాలు, కండోమ్స్, గర్భం మరియు స్వలింగసంపర్కం మొదలగు విషయాల గురించి చేసే చర్చలు చాలా క్లీన్ గా, నిజాయితీగా, హాస్యం తో కూడి ఉంటాయి.15 భాషలలో ఒక వెబ్ సిరీస్ ని ప్రారంభించడం ఇదే మొదటి సారి. ఇది హిందీ, తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం, కన్నడ, బెంగాలీ అంటే 6 భారతీయ భాషల్లో డబ్ కానుంది, మరియు ఇంగ్లీష్, చైనీస్, ఫ్రెంచ్, డచ్, స్పానిష్, జర్మన్, తెలుగు, మలేయ్ మరియు థాయ్ లాంటి పది ప్రపంచ భాషల్లో సబ్ టైటిల్స్ తో విడుదల కానుంది..

ఆనంద్ తివారీ, కబీర్ సాజిద్, ప్రముఖ బుల్లి తెర నటి సంజీద షేక్, ‘దమ్ లగాకే హైసా’ ఫేం అల్క అమిన్, సచిన్ పిల్ గావొంకర్, లాంటి వారు నటిస్తున్న ఈ వెబ్ సిరీస్ తో 
Y- ఫిల్మ్స్ అధినేత ఆశిష్ పటేల్ దర్శకునిగా పరిచయం కానున్నారు. గోపాల్ దత్ మరియు దేవాంగ్ కక్కడ్ రచించిన ఈ స్టొరీని, అమ్రిత్ పాల్ బింద్రా మరియు ఆనంద్ తివారి డెవలప్ చేసారు. 

ఈ స్టొరీ వత్స ఫ్యామిలీ చుట్టూ తిరుగుతుంది..ఏడేళ్ళ బాలుడు పప్పు తన తండ్రి ఆనంద్ కి చాలా ఇబ్బందికరమైన ప్రశ్నలు సందిస్తూ ఉంటాడు. ఆనంద్ చెప్పడానికి తన మొదట ఇబ్బంది పడినా, మెల్లగా చాలా సరదాగా,చిన్నచిన్నకధలతో వివరించడం మొదలు పెడతాడు.ఇలా చెప్పే క్రమంలో చాలా సాంప్రదాయకంగా ఉండే ఆనంద్ తనను తానే ప్రశ్నించు కోవడం మొదలు పెడతాడు. 

నిర్మాత-దర్శకుడు, ఆశిష్ పాటిల్ మాట్లాడుతూ, ” Y-ఫిలిమ్స్ ద్వారా మేము చెప్పే స్టొరీ లు ఎప్పటికప్పుడు ఒక కొత్త ఒరవడి సృష్టించేలా ఉండాలని అనుకుంటాము..
“సెక్స్ చాట్ విత్ పప్పు & పాపా” ఒక నూతన అధ్యాయాన్ని లిఖిస్తుంది. ప్రపంచం లోనే జనాభా లో రెండో స్థానంలో ఉన్న మన దేశంలో ఇంకా ‘సెక్స్’ ని ఒక నిషిద్ధ పదంలా చూడడం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. చాలా మంది తల్లి తండ్రులు, ‘పక్షులు, తేనెటీగలు’ లాంటి విషయాల గురించి పిల్లలతో మాట్లాడడానికి జంకుతుంటారు. తల్లిదండ్రులతో  సెక్స్ గురించి నేరుగా చర్చించడం సురక్షితమైన లైంగిక ప్రవర్తన తో ముడిపడి ఉందని పరిశోధనలో తేలింది. ప్రేమ, సెక్స్ లాంటి వాటికి భాష లేదు, అందుకే మేము ఈ సెక్స్ చాట్ ని 15 భాషలలో ఈ ముఖ్యమైన చాట్ ని మొదలు పెట్టబోతున్నాం.Durex లాంటి భాగస్వాములు ఉండడం వల్ల మేము ప్రపంచ వ్యాప్తంగా మా సందేశాన్ని వీలైనంత ఎక్కువ మందికి చెప్పడానికి వీలు కలిగింది. రండి, సెక్స్ గురించి చర్చిద్దాం”.

Durex ప్రతినిధి మాట్లాడుతూ, “హెచ్ఐవి కేసులలో ప్రపంచంలోనే మూడవ స్థానంలో, కండోమ్ వాడకం  5% కంటే తక్కువ ఉన్న మన దేశంలో సురక్షితమైన లైంగిక పద్దతులు గురించి చర్చించడం చాలా అవసరం. కాని మనం సెక్స్ ని నిషిద్ధ పదం గా చూడడం ఆపక పోతే ఇది సాధ్యం అయ్యే అవకాశాలు లేవు. Y-ఫిలిమ్స్ తో కలిసి ఈ వెబ్ సిరీస్ ని అందించడం మాకు గర్వ కారణం. సురక్షిత సెక్స్ గురించి మా సందేశం అందరికీ చేరుతుందని ఆశిస్తున్నాం”. 

భారత దేశపు సన్నని కండోమ్, Durex feel thin, Ching’s Desi Chinese తో కలిసి ఈ వెబ్ సిరీస్ ని సమర్పిస్తుంది. ఈ కంటెంట్ కోసం చాలా పరిశోధన జరిగింది..టాప్ హర్మోనల్ డాక్టర్స్, gynecological డాక్టర్స్ ని సంప్రదించడం జరిగింది. మేము ఇచ్చే ఈ సందేశం ప్రపంచ వ్యాప్తం గా చేరుతుందని ఆశిస్తున్నాం.

 

 

 

Durex and y-films launch sex chat in 15 languages!

About CineChitram

Check Also

మెగాబ్రదర్‌ నాగబాబుచే పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన ‘కళ్యాణ్‌ ఫ్యాన్‌ ఆఫ్‌ పవన్‌’

శ్రీ లక్ష్మీలోహిత క్రియేషన్స్‌ అండ్‌ శ్రీ శరణ్య సినీ చిత్ర కంబైన్స్‌ సంయుక్తంగా సత్య డైరెక్షన్‌లో నిర్మాత టి. రామకృష్ణ …

Discover more from Cine Chitram

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading