లావోస్ మోష‌న్ పిక్చ‌ర్స్ ప్రొడ‌క్ష‌న్ నెం-1 చిత్రం ప్రారంభం!

లావోస్ మోష‌న్ పిక్చ‌ర్స్ ప‌తాకంపై  నోయ‌ల్, శ్రీ ,అర్జున్ మీన‌న్,ఎస్తార్ హీరోహీరోయిన్లుగా కృష్ణ‌మోహ‌న్, న‌రేన్, శ్రీరామ్ కందుకూరి సంయుక్తంగా ప్రొడ‌క్ష‌న్ నెం-1 చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రాజ‌మౌళి వ‌ద్ద మ‌గ‌ధీర‌, మ‌ర్యాద రామ‌న్న‌, ఈగ చిత్రాల‌కు ద‌ర్శ‌క‌త్వ శాఖ‌లో ప‌ని చేసిన క్రాంతి వడ్ల‌మూడి ఈ చిత్రం ద్వారా ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మ‌వుతున్నారు. ఈ చిత్రం ముహూర్తం ఈ రోజు సంస్థ కార్యాల‌యంలో జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన `ల ఓ ల్` చిత్ర ద‌ర్శ‌కుడు జ‌గ‌దీష్ త‌ల‌సిల పూజా కార్య‌క్ర‌మాల్లో పాల్గొని ముహూర్త‌పు స‌న్నివేశానికి క్లాప్ నిచ్చారు. 
ఈ సంద‌ర్భంగా నిర్మాత‌లు మాట్లాడుతూ…“రాజమౌళి గారి వ‌ద్ద డైర‌క్ష‌న్ డిపార్ట్ మెంట్ లో ప‌లు చిత్రాల‌కు ప‌ని చేసి ఎంతో అనుభవాన్ని సంపాదించిన క్రాంతి వ‌డ్ల‌మూడి  ఓ డిఫ‌రెంట్ స‌బ్జెక్ట్ చెప్ప‌డంతో న‌చ్చి.. ఈ సినిమాను ఈ రోజు మా సంస్థ కార్యాల‌యంలో పూజా కార్య‌క్ర‌మాల‌తో ప్రారంభించాం. క‌థకు త‌గ్గ న‌టీటుల‌ను ఎంపిక చేశాము. డిసెంబ‌ర్ 19న తొలి షెడ్యూల్ ప్రారంభించ‌నున్నాం. అలాగే రెండో షెడ్యూల్ జ‌న‌వ‌రి 3 నుంచి ఉంటుంది. రెండు షెడ్యూల్స్ లో సినిమాను కంప్లీట్ చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నాం“ అన్నారు.
ద‌ర్శ‌కుడు క్రాంతి వ‌డ్ల‌మూడి మాట్లాడుతూ…“స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ గా సాగే చిత్ర‌మిది. త్వ‌ర‌లో టైటిల్ తో పాటు చిత్రానికి సంబంధించిన పూర్తి వివ‌రాలు వెల్ల‌డిస్తాం“ అన్నారు.
నోయ‌ల్, శ్రీ, అర్జున్ మీన‌న్,ఎస్తార్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్న ఈ చిత్రానికి కెమెరాః చేత‌న్ మ‌ధురాంత‌కం; స‌ంగీతంః గీతా పూనిక్; ఎడిట‌ర్ః త‌మ్మిరాజు, డైలాగ్స్ః టైమ్ నాని; ఆర్ట్ః డి.ర‌మేష్ బాబు;  పిఆర్వోః వంగాల కుమార‌స్వామి (బాక్సాఫీస్‌) ;ప్రొడ‌క్ష‌న్ కంట్రోల‌ర్ః బి.సి.చౌద‌రి;   నిర్మాత‌లుః కృష్ణ మోహ‌న్, న‌రేన్, శ్రీరామ్ కందుకూరి; ర‌చ‌న‌-ద‌ర్శ‌క‌త్వంః క్రాంతి వ‌డ్ల‌మూడి

 

Stills

About CineChitram

Check Also

మెగాబ్రదర్‌ నాగబాబుచే పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన ‘కళ్యాణ్‌ ఫ్యాన్‌ ఆఫ్‌ పవన్‌’

శ్రీ లక్ష్మీలోహిత క్రియేషన్స్‌ అండ్‌ శ్రీ శరణ్య సినీ చిత్ర కంబైన్స్‌ సంయుక్తంగా సత్య డైరెక్షన్‌లో నిర్మాత టి. రామకృష్ణ …

Discover more from Cine Chitram

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading