వరుస ప్రోజెక్టులతో యమ బిజీగా ఉన్న మంచు విష్ణు జి.ఎస్.కార్తీక్ దర్శకత్వంలో తాను నటిస్తున్న తెలుగు-తమిళ బైలింగువల్ చిత్రం టైటిల్ ను మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజా చేతుల మీదుగా తిరుపతిలో మోహన్ బాబు జన్మదినం సందర్భంగా నిర్వహించిన “శ్రీవిద్యానికేతన్ 25వ వార్షికోత్సవ” వేడుకల్లో ఎనౌన్స్ చేశారు. “ఓటర్” అనే టైటిల్ ఫిక్స్ చేయగా.. “హీరో ఆఫ్ ది నేషన్” అనేది ట్యాగ్ లైన్.
రామా రీల్స్ పతాకంపై సుధీర్ కుమార్ పూదోట (జాన్) నిర్మిస్తున్న ఈ చిత్రం ఇప్పటికే రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకొని ప్రస్తుతం హైద్రాబాద్ లో మూడో షెడ్యూల్ జరుపుకొంటోంది.
ఈ సందర్భంగా చిత్ర నిర్మాత సుధీర్ కుమార్ పూదోట (జాన్) మాట్లాడుతూ.. “మా మోహన్ బాబు గారి జన్మదినంతోపాటు ఆయన ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న “శ్రీవిద్యానికేతన్ 25వ వార్షికోత్సవ వేడుక సందర్భంగా మా సినిమా టైటిల్ ను మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజా గారి ద్వారా ఎనౌన్స్ చేయించడం చాలా సంతోషంగా ఉంది. తెలుగు-తమిళ భాషల్లో ఏకకాలంలో రూపొందుతున్న ఈ చిత్రం ఇప్పటికే రెండు కీలకమైన షెడ్యూల్స్ పూర్తి చేసుకొని మూడో షెడ్యూల్ కి సన్నద్ధమవుతోంది. తాజా షెడ్యూల్ ను భారీ స్థాయిలో హైద్రాబాద్ లో చిత్రీకరిస్తున్నాడు దర్శకుడు జి.ఎస్.కార్తీక్. “ఓటర్” చిత్రం మంచు విష్ణు కెరీర్ లో మైలురాయిగా నిలవడంతోపాటు మా చిత్ర బృందానికి మంచి పేరు తీసుకువస్తుంది” అన్నారు.
సంపత్ రాజ్, పోసాని కృష్ణమురళి, నాజర్, ప్రగతి, బ్రహ్మాజీ, సుప్రీత్, శ్రవణ్, బేసన్ నాగర్ రవి, ఎల్.బి.శ్రీరామ్ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కళ: కిరణ్ మన్నే, కూర్పు: కె.ఎల్.ప్రవీణ్, ఛాయాగ్రహణం: రాజేష్ యాదవ్, లైన్ ప్రొడ్యూసర్: ఎస్.కె.నయూమ్, సహ-నిర్మాత: కిరణ్ తనమాల, సంగీతం: ఎస్.ఎస్.తమన్, నిర్మాత: సుధీర్ కుమార్ పూదోట (జాన్), కథ-చిత్రానువాదం-మాటలు-దర్శకత్ వం: జి.ఎస్.కార్తీక్!!