సెన్సారు కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఇజం

నందమూరి తారక రామారావు ఆర్ట్స్‌ పతాకంపై, నందమూరి కళ్యాణ్‌రామ్‌ కథానాయకుడిగా,డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌ కాంబినేషన్‌లో వస్తోన్న పవర్‌ఫుల్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘ఇజం’.  ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తం గా అక్టోబర్ 21 న విడుదల చేస్తున్నట్లు చిత్ర బృందం తెలిపింది. ఈ చిత్రం నేడు సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ఈ చిత్రానికి U / A రేటింగ్ ను సెన్సార్ బోర్డు ఖరారు చేసింది.  
ఈ చిత్రం కేవలం రెండు గంటల పది నిమిషాల రన్ టైం తో, ఎక్కడా లాగ్ లేని ఫాస్ట్ స్క్రీన్ప్లే తో ఉంటుంది అని చిత్ర బృందం చెబుతోంది. ఒక కొత్త కాన్సెప్ట్ తో, ఇప్పటి వరకు తెలుగు తెర మీద చూడని ఒక సరికొత్త పాయింట్ తో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. 
సిక్స్ ప్యాక్ బాడీ తో, టోటల్ న్యూ లుక్ లో కనపడుతోన్న కళ్యాణ్ రామ్ కి సోషల్ మీడియా లో అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ఫెమినా మిస్ ఇండియా వరల్డ్ 2015 టైటిల్ గెలుచుకున్న అదితి ఆర్య ఈ చిత్రం లో హీరోయిన్. 
“ఇజం నా కెరీర్ లో ఒక స్పెషల్ చిత్రం గా నిలుస్తుంది అని నమ్ముతున్నాను. పూర్తి ఎంటర్టైన్మెంట్ తో పాటు ఒక మంచి సోషల్ ఎలిమెంట్ ని ఈ చిత్రం లో డైరెక్టర్ పూరి గారు ప్రెసెంట్ చేసారు. అక్టోబర్ 21 న విడుదల చేస్తున్నాం” అని నిర్మాత, హీరో అయిన నందమూరి కళ్యాణ్‌రామ్‌ తెలిపారు.
నందమూరి కళ్యాణ్‌రామ్‌, అదితి ఆర్య, జగపతిబాబు, గొల్లపూడి మారుతిరావు, తనికెళ్ళ భరణి, పోసాని కృష్ణమురళి, జయప్రకాష్‌రెడ్డి, ఆలీ, ఈశ్వరీరావు, వెన్నెల కిషోర్‌, రఘు, శత్రు, అజయ్‌ఘోష్‌, శ్రీకాంత్‌, కోటేష్‌ మాధవ, నయన్‌(ముంబై), రవి(ముంబై) తదిరులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. 
ఈ చిత్రానికి సంగీతం: అనూప్‌ రూబెన్స్‌, సినిమాటోగ్రఫీ: ముఖేష్‌, ఎడిటింగ్‌: జునైద్‌, పాటలు: భాస్కరభట్ల, ఫైట్స్‌: వెంకట్‌, ఆర్ట్‌: జానీ, కో-డైరెక్టర్‌: గురు, మేకప్‌ చీఫ్‌: బాషా, కాస్ట్యూమ్స్‌ చీఫ్‌: గౌస్‌, ప్రొడక్షన్‌ చీఫ్‌: బి.అశోక్‌, కాస్ట్యూమ్‌ డిజైనర్‌: అశ్విన్‌, స్టిల్స్‌: ఆనంద్‌, మేనేజర్స్‌: బి.రవికుమార్‌, బి.వి.నారాయణరాజు(నాని), వినయ్‌, క్యాషియర్‌: వంశీ, నిర్మాత: నందమూరి కళ్యాణ్‌రామ్‌, కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: పూరి జగన్నాథ్‌. 

About CineChitram

Check Also

సెన్సార్ పూర్తిచేసుకున్న ” అనుకోని ఓ కథ “

Leave a Reply

Discover more from Cine Chitram

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading