కే సి ఆర్ జీవిత౦ ఆధార౦గా సినిమా

కొందరు ఆయన్ని స్వరాష్ట్ర స్వాప్నికుడన్నారు. కొందరు తెలుగువారి మధ్యలో చిచ్చుపెట్టిన ప్రాంతీయవాది అన్నారు. కొందరు ఆయన్ని ప్రజాస్వామిక వ్యవస్థలో నియంత అన్నారు. కొందరు నియంతృత్వ ధోరణులున్న ప్రజాస్వామ్య రక్షకుడన్నారు. కొందరు ఆయాన్ని పోరాటశక్తి అన్నారు. కొందరు కేవలం ఆరాటపరుడు అన్నారు. కొందరు ఆయన్ని రాజనీతి విద్వాంసుడన్నారు. కాని 4 కోట్ల తెలంగాణా ప్రజలకు ఆయన ఒక ఆశయ సారధి… వారి కలలను నిజం చేసిన మహా నాయకుడు.

ఎవరు ఏమన్నా, ఎవరు ఎలా అనుకున్నా, ఉద్యమంలో ఆయన ముందుకు సాగారు. ఇదంతా మనమందరం చూసిన చరిత్ర, చూస్తున్న వర్తమానం. కేసీయార్ అనే మూడక్షరాలు తెలంగాణ ఉద్యమానికి ఎప్పుడైతే చిరునామాగా మారాయో, దేశం మొత్తం ఉద్యమాన్ని ఒక సానుకూల ధొరణిలో చూడటం మొదలు పెట్టింది…

1969 తెలంగాణా ఉద్యమంలో పాల్గొన్న మా నాన్న చెప్పే సంగతులు వింటూ పెరిగిన నేను, విన్న ఆనాటి సంగతులు, చూసిన ఈనాటి సంఘటనలు నాలో ఉన్న దర్శకుడిని కొన్నాళ్లుగా నిద్రపోనీయలేదు. ఆ క్రమంలో కొన్ని పరిశోధనలు చేసాను. తెలంగాణా, సమైక్యాంధ్ర ఉద్యమకారుల్ని విడివిడిగా కలిసాను. కొందరి మాటల ద్వారా ఎన్టీయార్, చంద్రబాబు నాయుడు, వై. ఎస్. ఆర్, సోనియా గాంధి, చిరంజీవి, లగడపాటి రాజ్ గోపాల్, వెంకయ్యనాయుడు, అద్వాని ఇంకా పవన్ కళ్యాణ్ తెలంగాణా ఉద్యమాన్ని అర్థం చేసుకున్న తీరు తెలుసుకున్నాను. 

మహాత్మా గాంధి, మార్టిన్ లూథర్ కింగ్, నెల్సన్ మండేలాలకు ఏమాత్రం తీసిపోని అత్యంత సంక్లిష్టమైన, భయంకరమైన సవాళ్లు కేసీయార్ ఎలా ఎదుర్కున్నారనే విషయాలు తెలుసుకున్నాక ఇక ఈ చరిత్రని తెరపైకి ఎక్కించాల్సిందేనని ఒక దర్శకుడిగా నిర్ణయం తీసుకున్నాను. 2017 జూన్ 2 న తెలంగాణా ఆవిర్భావదినోత్సవాన షూటింగ్ మొదలుపెట్టి, 2018 ఫిబ్రవరి 17న కేసీయార్ జన్మదినం సందర్భంగా రిలీజ్ చేయబోతున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత రాజ్ కందుకూరి తన

ధర్మపధ క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. 

మధుర శ్రీధర్ రెడ్డి

About CineChitram

Check Also

తెలుగు సినిమా ని ఉరితీయ‌కండి…. ‘క‌త్రిన,క‌రీన‌,మ‌ద్య‌లో’ క‌మ‌ల్‌హ‌స‌న్ ద‌ర్శ‌కుడు ర‌త్న‌

Leave a Reply

Discover more from Cine Chitram

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading