సాయి అరుణాచలేశ్వర క్రియేషన్స్‌ ప్రొడక్షన్‌ నెం.1 `హ‌రే రామ హ‌రే కృష్ణ‌` ప్రారంభం

సాయి అరుణాచలేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌పై దిలీప్‌ ప్రకాష్‌, రెజీనా హీరో హీరోయిన్లుగా అర్జున్‌సాయి దర్శకత్వంలో నవీన్‌ రెడ్డి ఎన్‌ నిర్మాతగా కొత్త చిత్రం `హ‌రే రామ హ‌రే కృష్ణ‌`  శుక్రవారం హైదరాబాద్‌ రామానాయుడు స్టూడియోలో ప్రారంభమైంది. ముహుర్తపు సన్నివేశానికి చందు మొండేటి క్లాప్‌ కొట్టగా, ఎడిటర్‌ కోటగిరి వెంకటేశ్వరరావు కెమెరా స్విచ్చాన్‌ చేశారు. తొలి సన్నివేశానికి వీరశంకర్‌ గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా…. 

దర్శకుడు అర్జున్‌సాయి మాట్లాడుతూ – ”శ్రీమన్నారాయణ, ఢమరుకం, నక్షత్రం సినిమాలకు రచయితగా పనిచేశాను. దర్శకుడుగా నా తొలి చిత్రమిది. కామెడికి ఎక్కువ ఇంపార్టెన్స్‌ ఇస్తూ స్క్రిప్ట్‌ను తయారుచేసుకున్నాను. మే నెల ప్రథమార్థంలో కులుమనాలిలో సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ జరుగుతుంది” అన్నారు. 

రెజీనా మాట్లాడుతూ – ”డిఫరెంట్‌ కథ, కథనాలతో సాగే చిత్రమిది. హెచ్‌.ఆర్‌.డిపార్ట్‌మెంట్‌లో కనపడే అమ్మాయి. సంప్రదాయ కళలకు ఆదరణ తగ్గిపోతున్నాయి. అలా ఆదరణ తగ్గిపోతున్న సంప్రదాయ కళలను కాపాడటానికి ప్రయత్నించే యువతి పాత్రలో నేను నటిస్తున్నాను. నా పాత్రను దర్శకుడు అర్జున్‌గారు బాగా డిజైన్‌ చేశారు. ఈ సినిమాలో నా మదర్‌ పాత్రలో సీనియర్‌ హీరోయిన్‌ ఆమనిగారు నటిస్తున్నారు” అన్నారు. 

నిర్మాత నవీన్‌రెడ్డి ఎన్‌ మాట్లాడుతూ – ”ఏడాదిన్నర క్రితం ఈ కథను దర్శకుడు అర్జున్‌ చెప్పారు. వినగానే బాగా నచ్చింది. రెగ్యులర్‌ కమర్షియల్‌ సినిమాలకు భిన్నంగా మా సినిమాను రూపొందిస్తాం. మంచి టీం కుదిరింది. ప్రకాష్‌రాజ్‌, రసూల్‌ ఎల్లోర్‌గారు ఒప్పుకోకుంటే సినిమా చేసేవాడిని. రెజీనా చాలా బిజీగా ఉన్నా, కథ నచ్చగానే సినిమా చేయడానికి ఒప్పుకోవడం ఆనందంగా ఉంది.తెలుగు, తమిళంలో ఏకకాలంలో సినిమాను తెరకెక్కిస్తాం” అన్నారు. 

రసూల్‌ ఎల్లోర్‌ మాట్లాడుతూ – ”హిందీలో చేయాల్సిన సినిమా ఇది. చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. అప్పుడప్పుడు ప్రేక్షకులకు చేంజ్‌ కలిగించే కాన్సెప్ట్‌ చిత్రమిది. కొత్త నటీనటులను ఆదరిస్తే మరిన్ని కొత్త సినిమాలు వస్తాయి” అన్నారు. 

దిలీప్‌ప్రకాష్‌ మాట్లాడుతూ – ”హీరోగా నా తొలి చిత్రమిది. తొలి సినిమానే మంచి సీనియర్స్‌ ఉన్న టీంతో కలిసి పనిచేయడం ఎంతో ఆనందంగా ఉంది. నన్ను ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకం ఉంది” అన్నారు. 

ఈ కార్యక్రమంలో హీరో బ్రహ్మ కడలి తదితరులు పాల్గొన్నారు. 

ప్రకాష్‌రాజ్‌, ఆమని, నాజర్‌, కృష్ణభగవాన్‌, కాశీవిశ్వనాథ్‌, అలీ, పృథ్వీ, నాగినీడు, రచ్చరవి, రఘుబాబు తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి మాటలు: రమణ గోపిశెట్టి, కళ: బ్రహ్మకడలి, కూర్పు: కోటగిరి వెంకటేశ్వరరావు, ఛాయాగ్రహణం: రసూల్‌ ఎల్లోర్‌, సంగీతం: అనూప్‌ రూబెన్స్‌, నిర్మాత: నవీన్‌ రెడ్డి ఎన్‌, రచన-దర్శకత్వం: అర్జున్‌ సాయి

About CineChitram

Check Also

మెగాబ్రదర్‌ నాగబాబుచే పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన ‘కళ్యాణ్‌ ఫ్యాన్‌ ఆఫ్‌ పవన్‌’

శ్రీ లక్ష్మీలోహిత క్రియేషన్స్‌ అండ్‌ శ్రీ శరణ్య సినీ చిత్ర కంబైన్స్‌ సంయుక్తంగా సత్య డైరెక్షన్‌లో నిర్మాత టి. రామకృష్ణ …

Discover more from Cine Chitram

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading