రోశయ్య ఆవిష్కరించిన భీమవరం టాకీస్ ‘కాదంబరి ఇంటి నెంబర్ 150’ ట్రైలర్

ఒకే సంవత్సరంలో పదమూడు సినిమాలు నిర్మించడం అభినందనీయం  -కొణిజేటి రోశయ్య 
భీమవరం టాకీస్ పతాకం పై ప్రముఖ నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ నిర్మాతగా హాసికాదత్ దర్శకత్వం వహిస్తూ లీడ్ రోల్ ప్లే చేస్తూ రూపొందిస్తున్న చిత్రం ‘కాదంబరి ఇంటి నెంబర్ 150’. తమిళంలో ఘనవిజయం సాధించిన ఈ చిత్రాన్ని నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ ‘కాదంబరి ఇంటి నెంబర్ 150’ గా తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. కాగా ఈ చిత్రం ట్రైలర్ ను ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్య హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్ లో ఆవిష్కరించారు. ఇదే వేదికపై నిర్మాతగా పలు విజయవంతమైన చిత్రాలు నిర్మించి నిర్మాతగా తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానం ఏర్పరచుకున్న తుమ్మలపల్లి రామసత్యనారాయణ ఒకే సంవత్సరంలో పదమూడు సినిమాలు నిర్మించిన నేపధ్యాన్ని పురస్కరించుకుని భారత్ ఆర్ట్స్ అకాడమీ వారి  భారత్ వరల్డ్ రికార్డ్స్ లో పేరు నమోదైన ప్రశంసా పత్రాన్ని కొణిజేటి రోశయ్యగారు సమర్పించి శాలువాతో సత్కరించారు. 
ఈ సందర్భంగా కొణిజేటి రోశయ్య మాట్లాడుతూ .. ‘సినిమా గురించి నాకు అంతగా అవగాహన లేనప్పటికి ఏంతోమంది శ్రమ పడుతూ వారి వారి టాలెంట్ ను ప్రదర్శిస్తూ మంచి మంచి సినిమాలను ప్రేక్షకులకు అందిస్తుంటారు  కనుక నాకూ  సినిమా పరిశ్రమ అంటే నాకు చాలా ఇష్టం. రామసత్యనారాయణ టెక్నిక్ గా చాలా తక్కువ ఖర్చుతో సినిమాలు తీస్తుంటాడు. సినిమాలు తీయడమే కాదు వాటిని ఎంతో సమర్ధవంతంగా రిలీజ్ చేస్తుంటాడు. అలాంటి రామసత్యనారాయణ ఒకే సంవత్సరంలో పదమూడు సినిమాలు నిర్మించి భారత్ వరల్డ్ రికార్డులో నమోదు కావడం నిజంగా అభినందనీయం. అలాంటి రామసత్యనారాయణను సత్కరించడం ఆనందంగా ఉంది. ప్రస్తుతం రామసత్యనారాయణ చేస్తున్న కాదంబరి ఇంటి నెంబర్ 150 ట్రైలర్ చాల బావుంది. ఈ సినిమా యూనిట్ అందిరికి మంచి విజయాన్ని అందిస్తుందని భావిస్తున్నాను. ఈ కోవలోనే రామసత్యనారాయణ  ముందు ముందు మరిన్ని మంచి సినిమాలు నిర్మించి నిర్మాతగా ఎన్నో విజయాలు అందుకోవాలని కోరుకుంటున్నాను’ అన్నారు. 
నిర్మాత రామసత్యనారాయణ మాట్లాడుతూ.. ‘పెద్దాయన రోశయ్యగారి చేతుల మీదుగా ఈ పురస్కారం అందుకోవడం నా మొట్టమొదటి విజయంగా భావిస్తున్నాను. నేను సినిమా పరిశ్రమకు వచ్చిన మొదట్లో కమర్షియల్ గా కొంత లాస్ అయినప్పటికీ సినిమా మీదున్న ఇష్టంతో ఎన్ని కష్టాలు ఎదురైనప్పటికి వాటిని అధిగమించి సక్సెస్ పధంలో నడవగలిగాను. సినిమా తీయడంతో నిర్మాత భాద్యత అయిపోదు దాన్ని సమర్ధవంతంగా రిలీజ్ చేసినప్పుడే నిర్మాత సక్సెస్ అయినట్టు. కొన్ని మెళకువలు తెలుసుకొని సినిమా ప్రమోషన్ చేస్తే తప్పకుండ సక్సెస్ కాగలం. ఆ మెళుకువలుతో ఇన్ని సినిమాలు చేయగలిగాను. ఈ రోజున నేనీ స్థాయిలో ఉన్నానంటే దానికి పెద్దాయన రోశయ్యగారు, గురువుగారు దాసరిగారు ముఖ్య కారణం. నా సక్సెస్ లో వారి సహకారం మరువలేనిది. ఈ సందర్భంగా వారికి నా హృదయపూర్వక కృతఙ్ఞతలు తెలుపుకుంటున్నాను. సినిమా మీద నాకున్న ఇష్టంతో ఒకే సంవత్సరంలో పదమూడు సినిమాలు చేసినందుకుగాను భారత్ వరల్డ్ రికార్డు లో పేరు నమోదు కావడం చాలా ఆనందంగా ఉంది. ఈ సందర్భంగా వారికి నా కృతఙ్ఞతలు తెలుపుకుంటున్నాను’ అన్నారు. 
కాట్రగడ్డ ప్రసాద్ మాట్లాడుతూ.. ‘ఒకే సంవత్సరంలో పదమూడు సినిమాలు నిర్మించడం మామూలు విషయం కాదు. అది ఒక్క రామసత్యనారాయణకే సాధ్యం. ఒక నిర్మాతననే ఫీలింగ్ లేకుండా పని చేస్తాడు కాబట్టే ఇన్ని సినిమాలు తీసి భారత్ వరల్డ్ రికార్డ్స్ లో చేరగలిగాడు. కేవలం భారత్ వరల్డ్ రికార్డ్స్ లోనే కాదు గిన్నిస్ రికార్డ్స్ లో కూడా ఆయన పేరు ఎక్కాలని, ముందు ముందు మరిన్ని సక్సెస్లు అందుకోవాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ కాదంబరి ఇంటి నెంబర్ 150 సినిమా కూడా పెద్ద హిట్ అవుతుందని ఆశిస్తున్నాను’ అన్నారు. 
భారత్ వరల్డ్ రికార్డ్స్ ప్రతినిధి రమణ మాట్లాడుతూ.. ‘భారతదేశంలో రకరకాల వండర్స్, ఎక్సట్రార్డినరీ టాలెంట్స్, ఎక్సట్రార్డినరీ థింగ్స్ ను వెలికి తీసి వారి పేరును, టాలెంట్ ను అందరికీ తెలియజేయడంలో భాగంగా ఒకే సంవత్సరంలో పదమూడు సినిమాలు తీసి నిర్మాత యొక్క గొప్పతనాన్ని చాటిన తుమ్మలపల్లి రామసత్యనారాయణను మా భారత్ వరల్డ్ రికార్డ్స్ లో ఆయన పేరు నమోదు చేయడం చాలా ఆనందంగా ఉంది. అలాంటి గొప్ప కార్యక్రమం పెద్దలు రోశయ్య గారి సమక్షంలో జరగడం మా అదృష్టంగా భావిస్తున్నాం’ అన్నారు. 
ఇంకా ఈ కార్యక్రమంలో పాల్గొన్న సాయి వెంకట్, మల్కాపురం శివకుమార్, నటుడు శివాజీరాజా, ప్రసన్నకుమార్, గజల్ శ్రీనివాస్, నటి కవిత, శోభారాణి, కాదంబరి ఇంటి నెంబర్ 150 దర్శకురాలు హాసికాదత్ లు ప్రసంగిస్తూ మిత్రుడు రామసత్యనారాయణ తనలోని కసి, కృషి, పట్టుదల వల్లనే ఈ రోజున ఈ స్థాయికి రాగలిగారు. ప్రస్తుతం నిర్మాతగా 100సినిమాలకు చేరువలో ఉన్న రామసత్యనారాయణ ముందు ముందు 100సినిమాలు దాటి మరిన్ని సినిమాలు చేయాలనీ, మరెన్నో విజయాలు అందుకోవాలని, ప్రస్తుతం చేస్తున్న కాదంబరి ఇంటి నెంబర్ 150 సినిమా ట్రైలర్ చూస్తుంటే సినిమా ఎప్పుడెప్పుడు చూద్దామా అన్నంత ఆసక్తిగా ఉందని, తప్పకుండా పెద్ద సక్సెస్ సాధించాలని  మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామని తెలిపారు. 

హాసికాదత్, మధుమిత, రాజీవా, వినయ్, శ్రీమాన్, సిండ్రాయన్ ప్రధాన పత్రాలు పోషిస్తున్న ఈ చిత్రానికి మాటలు: సెల్వం, పాటలు: పోతుల రవికిరణ్, ఛాయాగ్రహణం: కార్తీక్ నల్లముత్తు, సంగీతం: ఉమేష్, ప్రెస్ రిలేషన్స్: ధీరజ అప్పాజీ, ఎక్సిక్యూటివ్ ప్రొడ్యూసర్: కె.ఆర్.ఫణిరాజ్, నిర్మాత: తుమ్మలపల్లి రామసత్యనారాయణ, కథ- స్క్రీన్ ప్లే- దర్శకత్వం: హాసికాదత్!! 

Stills

About CineChitram

Check Also

`ఖ‌య్యూం భాయ్` టీజ‌ర్ ఆవిష్క‌ర‌ణ‌

Discover more from Cine Chitram

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading