కాకతీయ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్

సామాజిక సమరసత, సేవా, జాగరుకత అంశంపై

సమాచార భారతి ఆధ్వర్యంలో కాకతీయ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్

 

సమాచార భారతి కల్చరల్ అసోసియేషన్ వారు “ఏక్ భారత్, సమరస భారత్” విషయాన్ని కేంద్రంగా చేసుకుంటూ “కాకతీయ ఫిలిం ఫెస్టివల్” అనే లఘుచిత్రోత్సవాన్ని 17 డిసెంబర్ 2016 నాడు హైదరాబాద్ లో నిర్వహిస్తున్నారు.

ఈ ఉత్సవం ద్వారా యువతలో ఉన్న సృజనాత్మక కళను వెలుగులోకి తీసుకోని రావాలన్నది ప్రధాన లక్ష్యం. సమాజంలోని ‘సమరసత‘, ‘సేవ’, ‘జాగరుకత’ అనే అంశాలపై యువతలో ఉన్న ఆలోచన, స్పందన, దృష్టిని ప్రదర్శన రూపంలో చెప్పే అవకాశాన్ని సమాచార భారతి కల్చరల్ అసోసియేషన్ కల్పించబోతోంది. ఈ చిత్రోత్సవానికి శ్రీ ‘సిరివెన్నెల’ సీతారామ శాస్త్రి గారు, తనికెళ్ళ భరణి గారు పోషకులుగా వ్యవహరిస్తున్నారు.

కాకతీయ ఫిలిం ఫెస్టివల్ న్యాయ నిర్ణేతలుగా శ్రీ అల్లాణి శ్రీధర్, సినీ దర్శకులు; శ్రీ కోమల శ్రీధర్ రెడ్డి (మధుర శ్రీధర్ గా సుపరిచితులు) సినీ దర్శక,నిర్మాత; శ్రీ సుమంత్ పరాంజి, నిర్మాత; శ్రీ శేఖర్ సూరి, ప్రముఖ దర్శకులు; శ్రీ వినయ్ వర్మ (‘సుత్రదార్’ థియటర్ సంస్థ ప్రముఖులు), శ్రీ ఎ. ప్రభు,(సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్, సెన్సార్ బోర్డ్ మెంబర్) వ్యవహరిస్తున్నారు.

నమోదు  : ఈ లఘు చిత్రోత్సవంలో పాల్గొనదలిచిన వారికి నమోదు ఉచితం.

బహుమతులు : ప్రదర్శనలో ఎంపిక చేయబడిన ఉత్తమ చిత్రానికి రూ.51,000,

ద్వితీయ బహుమతిగా రూ. 21,000, 

తృతీయ బహుమతిగా రూ 11,000 ల నగదు పారితోషికాన్ని అందచేస్తారు.

ఇతర ముఖ్యమైన వివరాలు

చిత్రాలు తెలుగు, హిందీ, ఇంగ్లీష్ లేదా ఎలాంటి మాటలు లేకున్నా 10 నిమిషాల పూర్తి నిడవితో ఉండాలి. మీరు పంపించేవి. మీ సొంతసృజనాత్మకతతో తీసినవి అయిఉండాలి. అట్టివాటిని 11 డిసెంబర్ 2016 లోపు మాకు అందచేయాలి. ఎంపిక చేయబడిన చిత్రాలు 17 డిసెంబర్నాడు హైదరాబాద్ లోని సారథి స్టూడియోలో ప్రదర్శించబడుతాయి.

మా వెబ్ సైట్:  www.kakatiyafilmfestival.com

ఇ-మెయిల్:  kakatiyafilmfestival@gmail.com

మరిన్ని వివరాలకై:

ఆయుష్ నడుంపల్లి, కార్యదర్శి

సమాచార భారతి కల్చరల్ అసోసియేషన్

3-4-852, కేశవ నిలయం, బర్కత్ పుర,

హైదరాబాద్– 500027;

ఫోన్ : 040- 27550869;   (M) 9848038857

 

డా. గోపాల్ రెడ్డి

ప్రెసిడెంట్ – 9849642868(M)

Stills

About CineChitram

Check Also

దర్శకుడు మారుతి విడుదల చేసిన “లంక” టీజర్

Discover more from Cine Chitram

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading