ఆనందం అంబరమైతే

ఎస్ బి   మూవీస్ బ్యానర్ పై బుద్దాల సత్యనారాయణ నిర్మాణ సారధ్యంలో సుబ్బు ఈరంకి రచన, దర్శకత్వంలో “ ఆనందం అంబరమైతే “ సినిమా మోషన్ పోస్టర్ కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పిల్లి అనంత లక్ష్మీ ఘనంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చిత్ర దర్శకులు సుబ్బు మాట్లాడుతూ ఈ చిత్రం అన్ని తరగతుల  ప్రేక్షకులకు నచ్చే విధంగా సకుటుంబ సమేతంగా చూడదగ్గ విధంగా నిర్మిస్తున్నామన్నారు. గ్రామీణ నేపద్యంలో సాగే ఈ సినిమాలో ఫ్యామిలి, లవ్, ఎంటర్ టైన్ మెంట్ మిళితమై ఉంటుందన్నారు. 20 సంవత్సరాల క్రితం కుటుంబాలలో బంధాలు, అనుబంధాలు ఎలా ఉండేవో కళ్ళకు కట్టినట్లు ఉంటుందని, కన్న తల్లి, ఉన్న ఊరుకు… ఉన్న ప్రాధాన్యతను తెలిపే విధంగా ఈ ఆనందం అంబరమైతే సినిమా ఉంటుందన్నారు. ఈ సినిమా లో ఆరు పాటలకు  అద్భుతంగా సంగీతాన్ని కాకినాడకు చెందిన శ్రీకృష్ణ అందించడం ఆనందదాయకంగా ఉందన్నారు. అనంతరం నిర్మత బుద్దాల సత్యనారాయణ మాట్లాడుతూ ఈ సినిమా కథకు హీరో గా అనిపించి అందరూ కొత్తవాళ్ళతో నిర్మాణాన్ని చేపట్టామన్నారు. చిత్ర నిర్మాణానంతర కార్యక్రమాలైన డబ్బింగ్, ఎడిటింగ్ వంటి కార్యక్రమాలకు అనువుగా తూర్పుగోదావరి జిల్లా కాకినాడ సమీపంలో అత్యాధునిక టెక్నాలజీతో డబ్బింగ్ థియేటర్ నిర్మించడం జరిగిందని ఈ సినిమాను అక్కడే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్  పూర్తి చేయడం జరిగిందన్నారు. అనంతరం ఎస్ బి మూవీస్ లోగో ఆవిష్కరణ ప్రముఖ గాయిని పెద్దాడ సూర్యకుమారి ఆవిష్కరించారు. ప్రముఖ కథ రచయిత రాధిక రచించిన పాటను కాకినాడ రూరల్ మాజీ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు చేతుల మీదుగా ఆనందం అంబరమైతే సినిమా టైటిల్ గా ఆవిష్కరించారు. అనంతరం కన్నబాబు మాట్లాడుతూ ఉభయగోదావరి జిల్లాలో ప్రకృతి అందాలతో కనువిందుగా కనిపించే పరిసరప్రాంతాలలో ఈ చిత్రాన్ని నిర్మించడం ఆనందదాయకమన్నారు. ఈ సినిమాలో కథానాయకుడుగా ఆర్ కే, కథానాయికగా అవంతిక ప్రధాన పాత్రలలో సురేష్, కాకినాడ నాని, మధు, మాష్టర్ చిలకచర్ల కిషోర్ చంద్ర, మాష్టర్ బుద్దాల కృష్ణ చైతన్య నాయుడు, భాను, నాగలక్ష్మిలు నటిస్తున్నారు.   

Stills

About CineChitram

Check Also

మెగాబ్రదర్‌ నాగబాబుచే పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన ‘కళ్యాణ్‌ ఫ్యాన్‌ ఆఫ్‌ పవన్‌’

శ్రీ లక్ష్మీలోహిత క్రియేషన్స్‌ అండ్‌ శ్రీ శరణ్య సినీ చిత్ర కంబైన్స్‌ సంయుక్తంగా సత్య డైరెక్షన్‌లో నిర్మాత టి. రామకృష్ణ …

Discover more from Cine Chitram

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading