తెలంగాణ డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్ రెడ్డి చేతుల మీదుగా “సత్య గ్యాంగ్” ప్రారంభం !!

సిద్ధయోగి క్రియేషన్స్ పతాకంపై ప్రత్యూష్ వి.ఆర్, హర్షిత పన్వార్, కిషన్ కన్నయ్య కె.కె, సాత్విక్, సిరి కొమ్ము ముఖ్య పాత్రలు పోషిస్తున్న యాక్షన్ ఎంటర్ టైనర్ “సత్య గ్యాంగ్”. యువ ప్రతిభాశాలి ప్రభాస్ నిమ్మల దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రాన్ని సిద్ధయోగి క్రియేషన్స్ పతాకంపై మహేష్ కన్నా నిర్మిస్తున్నారు. ఎస్.మంగారావు-చలపతి సహ నిర్మాతలు. ఈ చిత్రం ప్రారంభోత్సవం అన్నపూర్ణ స్టూడియోస్ లో జరిగింది. సీనియర్ దర్శకులు సముద్ర పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం హీరోహీరోయిన్స్ పై చిత్రీకరించిన ముహూర్తపు షాట్ కు తెలంగాణ డిప్యూటీ స్పీకర్ శ్రీమతి పద్మ దేవేందర్ రెడ్డి క్లాప్ కొట్టగా.. ప్రముఖ నిర్మాత మల్కాపురం శివకుమార్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. ప్రముఖ నిర్మాతలు బి.కాశీవిశ్వనాధం, తుమ్మలపల్లి \రామసత్యనారాయణ గౌరవ దర్శకత్వం వహించారు. తన చేతుల మీదుగా ప్రారంభోత్సం జరుపుకుంటున్న ఈ చిత్రం ఆడియో ఫంక్షన్ కు కూడా తాను తప్పకుండా వస్తానని, సినిమా కూడా చూస్తానని పద్మా దేవేందర్ రెడ్డి అన్నారు. ప్రభాస్ నిమ్మల వంటి ప్రతిభాశాలిని దర్శకుడిగా పరిచయం చేస్తూ.. “సత్యా గ్యాంగ్” చిత్రం ద్వారా సినిమా నిర్మాణ రంగంలోకి ప్రవేశిస్తుండడం చాల ఆనందంగా ఉందని నిర్మాత మహేష్ కన్నా అన్నారు. ప్రముఖ దర్శకులు సముద్ర వద్ద పలు చిత్రాలకు పని చేసిన తనకు “సత్య గ్యాంగ్” చిత్రంతో దర్శకత్వం వహించే అవకాశం ఇఛ్చిన మహేష్ కన్నాకు కృతజ్ఞతలు తెలిపిన దర్శకుడు ప్రభాస్..  నందమూరి హరి (ఎడిటర్), అడుసుమిల్లి విజయకుమార్ (సినిమాటోగ్రాఫర్) వంటి టాప్ టెక్నీషియన్స్ “సత్య గ్యాంగ్” చిత్రానికి పని చేస్తుండడం తనకు ఎంతో సంతోషంగా, గర్వంగా ఉందని అన్నారు.  “సత్య గ్యాంగ్” చిత్రంతో పరిచయమవుతుండడం చాలా ఆనందంగా ఉందనిహీరోహీరోయిన్స్ ప్రత్యూష్ వి.ఆర్, హర్షిత పన్వార్, కిషన్ కన్నయ్య, కె.కె, సాత్విక్, సిరి కొమ్ము అన్నారు. ముఖ్య అతిధులుగా హాజరయిన మల్కాపురం శివకుమార్, కాశీవిశ్వనాధం, రామసత్యనారాయణ చిత్ర బృందానికి “ఆల్ ది బెస్ట్” తెలిపారు. 
వినోద్ కుమార్, జీవా, సమీర్, జెన్నీ, బి.హెచ్.ఐ.ఎల్ ప్రసాద్, విజయ్, చిట్టిబాబు, జబర్దస్త్ అప్పారావు, గబ్బర్ సింగ్ రాజశేఖర్, అంజిబాబు, ప్రేమ్, మహేష్ కన్నా, సలీం, రామ్, బాబురావు కె ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి ఫైట్ మాస్టర్: నందు, ఆర్ట్ డైరెక్టర్: డేవిడ్, కో-డైరెక్టర్: కొండలరావు, పాటలు: కులశేఖర్, ఎడిటింగ్: నందమూరి హరి, సినిమాటోగ్రఫీ: అడుసుమిల్లి విజయకుమార్, సహ నిర్మాతలు: ఎస్.మంగారావు-చలపతి, నిర్మాత: మహేష్ కన్నా, కథ-స్క్రీన్ ప్లే-సంగీతం-మాటలు-దర్శకత్వం: ప్రభాస్ నిమ్మల !!

 

Stills

About CineChitram

Check Also

మెగాబ్రదర్‌ నాగబాబుచే పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన ‘కళ్యాణ్‌ ఫ్యాన్‌ ఆఫ్‌ పవన్‌’

శ్రీ లక్ష్మీలోహిత క్రియేషన్స్‌ అండ్‌ శ్రీ శరణ్య సినీ చిత్ర కంబైన్స్‌ సంయుక్తంగా సత్య డైరెక్షన్‌లో నిర్మాత టి. రామకృష్ణ …

Discover more from Cine Chitram

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading