‘దేశవాళి వినోదం’ పంచే ‘జయమ్ము నిశ్చయమ్మురా’ సమైక్యంగా నవ్వుకుందాం రండి!

క్లీన్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా రూపొందిన సినిమాలను-సకుటుంబ సమేతంగా చూసి ఆనందించదగ్గ సినిమాలుగా పేర్కొంటుంటారు. కానీ.. ‘జయమ్ము నిశ్చయమ్మురా’ సినిమా దర్శకనిర్మాత శివరాజ్ కనుమూరి మాత్రం ‘సమైక్యంగా నవ్వుకుందాం’ అంటున్నారు. అలాగే తన సినిమాలో తాను పండించిన వినోదానికి ‘దేశవాళి వినోదం’ అనే నామకరణం చేసి అందరి దృష్ఠినీ విశేషంగా ఆకర్షిస్తున్నారాయన. 
ఇక రీరికార్డింగ్ అవ్వకుండానే ఈ సినిమా రష్ చూసిన ప్రముఖ దర్శకుడు సుకుమార్- శివరాజ్ కనుమూరి దర్శకత్వంలో- తన స్వంత నిర్మాణ సంస్థ ‘సుకుమార్ రేటింగ్స్’ పతాకం పై సినిమా ప్రకటించడం పరిశ్రమ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

‘శ్రీనివాసరెడ్డి -పూర్ణ జంటగా శివరాజ్ ఫిలింస్ పతాకంపై ఏ.వి.ఎస్.రాజు సమర్పణలో శివరాజ్ కనుమూరి స్వీయనిర్మాణంలో దర్శకత్వం వహిస్తున్న ‘జయమ్ము నిశ్చయమ్మురా’. సాంగ్ టీజర్ ను సుకుమార్ విడుదల చేసారు. ఈ సినిమా రష్ చూసి తాను స్పిల్ బౌండ్ అయ్యానని ఈ సందర్భంగా సుకుమార్ అన్నారు. శివరాజ్ మా మట్టపర్రు (సుకుమార్ స్వస్థలం)కుర్రాడని చెప్పుకోవడానికి చాల గర్వపడుతున్నానని అయన పేర్కొన్నారు. 

‘జయమ్ము నిశ్చయమ్మురా’ నా కెరీర్ కు గొప్ప టర్నింగ్ పాయింట్ గా నిలుస్తుందని శ్రీనివాస్ రెడ్డి తెలుపగా – ఈ సినిమా విడుదలయ్యాక తనను అందరూ ‘జయమ్ము నిశ్చయమ్మురా’ పూర్ణ అంటారని హీరోయిన్ పూర్ణ పేర్కొన్నారు.
రవిచంద్రన్ కార్తీక్ తీర్చిదిద్దిన ‘ఓ సారి ఇటు చూడవే’  పాటకు అద్భుతమైన స్పందన వస్తోందని, ఓ మళయాళ గీతం ప్రేరణతో ఈ పాటకు వారు ప్రాణం పోశారని దర్శకనిర్మాత శివరాజ్ కనుమూరి అన్నారు. సుకుమార్ గారి ప్రేరణతో ఈ చిత్రాన్ని తాను నిర్మించానని, సినిమా రష్ చూసిన ఆయన అందరికీ ఈ సినిమా గురించి ప్రత్యేకంగా చెబుతుండడంతో పాజిటివ్ బజ్ ఏర్పడిందని శివరాజ్ తెలిపారు. 
ఇంకా ఈ కార్యక్రమంలో ఈ చిత్ర సమర్పకులు ఏ.వి.ఎస్.రాజు, రవివర్మ, సినిమాటోగ్రాఫర్ నగేష్, ఎడిటర్ వెంకట్ తదితరులు పాల్గొన్నారు.
పోసాని కృష్ణమురళి, కృష్ణ భగవాన్, ప్రవీణ్, శ్రీ వైష్ణు, రవివర్మ, జోగి బ్రదర్స్, జీవ, మీనా, తాగుబోతు రమేష్, రోలర్ రఘు, ప్రబాస్ శ్రీను తదితరులు ఇతర ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రానికి డిఒపి: నగేష్ బానెల్, ఎడిటింగ్: ‘ఎడిటర్’ వెంకట్, ఆర్ట్: రఘు కులకర్ణి, సంగీతం: రవిచంద్ర, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్: కార్తీక్ రోడ్రిగీజ్, ఎక్సిక్యూటివ్ ప్రొడ్యూసర్: భాస్కర్, లైన్ ప్రొడ్యూసర్: రామ్ మంతెన (మధు), పబ్లిసిటీ డిజైన్: అనిల్ భాను, డాన్స్: భాను, పిఆర్ఓ: అప్పాజీ ధీరజ్, ప్రొడక్షన్ ఎక్సిక్యూటివ్: అనిల్ కుమార్ లక్కంరాజు, సమర్పణ: ఏ.వి.ఎస్.రాజు, స్క్రీన్ ప్లే: శివరాజ్ కనుమూరి-పరం సూర్యంసు, నిర్మాతలు: శివరాజ్ కనుమూరి, సతీష్ కనుమూరి, కథ-దర్శకత్వం: శివరాజ్ కనుమూరి. 

About CineChitram

Check Also

`కాట‌మ‌రాయుడు` చిత్రంలో `జివ్వు జివ్వు..` సాంగ్ రిలీజ్ చేసిన అనూప్‌

Leave a Reply

Discover more from Cine Chitram

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading